- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలపై నిఘా వర్గాల ఆరా!
by GSrikanth |
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలపై నిఘా వర్గాలు వివరాలు సేకరించినట్టు తెలుస్తున్నది.

X
దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలపై నిఘా వర్గాలు వివరాలు సేకరించినట్టు తెలుస్తున్నది. ఏ లీడర్ ఏ విధంగా వేడుకలు నిర్వహించారు? ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఎంత మంది హాజరయ్యారు అనే పూర్తి సమాచారాన్ని ఆరా తీసినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్‌పై ఇంటిలిజెన్స్ రిపోర్టు తయారు చేసి సీఎం కార్యాలయానికి పంపడం సహజం.
కానీ ఈసారీ కేసీఆర్ బర్త్ డే వేడుకలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి, కార్యక్రమాలపై పూర్తి వివరాలను అడిగినట్టు తెలుస్తున్నది. కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, లీడర్లు పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. వారంత త్వరలో పార్టీ మారేందుకు ప్లాన్ చేసుకున్నట్టు అధిష్టానం గుర్తించింది. పుట్టినరోజు వేడుకల్లో ఆ లీడర్లు పాల్గొన్నారా లేదా అని తెలుసుకునేందుకు రిపోర్టు అడిగినట్టు తెలుస్తున్నది.
Next Story






