- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ 'Gift a Smile' స్ఫూర్తితో వైద్య విద్యార్థినికి డాక్టర్ దంపతుల ఆర్థిక సాయం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదలుపెట్టిన 'గిఫ్ట్ ఏ స్మైల్' స్ఫూర్తితో పేద వైద్య విద్యార్థి సుష్మితకు వైద్య దంపతులు ఆర్థిక సాయం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మొదలుపెట్టిన (Gift a Smile) 'గిఫ్ట్ ఏ స్మైల్' స్ఫూర్తితో పేద వైద్య విద్యార్థి సుష్మిత (Medical student Sushmita)కు వైద్య దంపతులు ఆర్థిక సాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, వెంకటాపూర్‌కు చెందిన పేద వైద్య విద్యార్థి సుస్మిత విద్య కోసం, ఆర్థిక సాయం చేయాలని ఇటీవల ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కేటీఆర్ ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన కేటీఆర్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పిలుపునిచ్చిన "గిఫ్ట్ ఏ స్మైల్" స్ఫూర్తితో ముందుకు వచ్చిన (doctor couple) వైద్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ప్రణయ వాణి ఆర్థిక సాయం చేశారు. నేడు వారి కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థి సుస్మిత.. ఈ సందర్భంగా వైద్య దంపతులను కేటీఆర్ అభినందించారు.






