Medaram Jatara 2026 : మేడారంలో తూనికలు కొలతల అధికారుల హల్ చల్

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-01-28 12:26:58  IST  )

మేడారం మహా జాతరలో తూనికలు కొలతల శాఖ వరంగల్ జోన్ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలోని అధికారుల బృదం హల్ చల్ చేసింది.

Medaram Jatara 2026 : మేడారంలో తూనికలు కొలతల అధికారుల హల్ చల్
X

దిశ, మేడారం నెట్ వర్క్ : మేడారం మహా జాతరలో తూనికలు కొలతల శాఖ వరంగల్ జోన్ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలోని అధికారుల బృదం హల్ చల్ చేసింది. జాతర ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన బెల్లం, మాంసం, కోళ్ళు, చికెన్, కిరాణా, కూల్ డ్రింక్స్ దుకాణాలను తనిఖీ చేసి పలు జాగ్రత్తలు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు మాంసం, బెల్లం తక్కువ కొలతల రాళ్ళు వాడకుండా సరైన డిజిటల్ తూకాలు వాడాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి అమ్మకాలు పెంచుకోవాలన్నారు. మహా జాతరలో 20 దుకాణాలను తనిఖీ చేసి తక్కువ తూకం కలిగిన బరువులు వాడుతున్న ఆరుగురు దుకాణాదారులకు అపరాధ రుసుమును విధించారు. ఆయన వెంట వరంగల్ జోన్ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్ రావు, ఉమ్మడి భూపాలపల్లి జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీలత, ఖమ్మం జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ప్రవీణ్ కుమార్, వరంగల్ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్, జనగాం జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ఝాన్సీ, హన్మకొండ జిల్లా లీగల్ మెట్రాలాజీ అధికారి విశ్వేశ్వర్, మధిర లీగల్ మెట్రాలజీ అధికారి సుభాష్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story