ఎల్లుండే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన నిర్ణయం.. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ

by Prasad Jukanti |

స్థానిక ఎన్నికలపై ఎల్లుండి కీలక నిర్ణయం రాబోతోంది.

ఎల్లుండే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన నిర్ణయం.. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bypoll) ప్రచారం చుట్టూ సాగుతున్న తెలంగాణ రాజకీయం మరోసారి బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశం వైపు మళ్లబోతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో నమోదైన పిటిషన్‍పై ఎల్లుండి తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు డెసిషన్ ఏంటి అని ఇటు బీసీ సంఘాలు అటు రాజకీయపార్టీల్లో ఆసక్తి నెలకొంది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడలతో రాబోతోందని అనేది పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. ఇప్పడికే పీక్స్ కు చేరిన జూబ్లీహిల్స్ ప్రచారపర్వంలో పార్టీల మధ్య డైలాగుల తూటాలు పేలుతున్న సమయంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టులో (Telangana High Court) విచారణ స్టేట్ పాలిటిక్స్ ను ఎలాంటి పరిణామాల వైపు తీసుకెళ్ళనుందో సస్పెన్స్ గా మారింది.

సుప్రీం టు హైకోర్టు:

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధం అంటూదాఖలైన పిటిషన్‍పై గత నెల నెల 9న విచారణ జరిపిన హైకోర్టు రిజర్వేషన్లపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ సైతం దాఖలు చేసింది. అయితే ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‍ను సుప్రింకోర్టు తోసిపుచ్చింది. దాంతో హైకోర్టు నిర్ణయంకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. గత విచారణలో రిజర్వేషన్ల జీవోపై స్టే విధించిన హైకోర్టు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ వాయిదా అనంతరం ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

హైకోర్టు తీర్పు తర్వాతే సర్కార్ నిర్ణయం:

నవంబర్ 3న హైకోర్టు వెలువరించే నిర్ణయం అధారంగా స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. గత నెల 23న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో హైకోర్టు నిర్ణయం ఆధారంగా స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు నిర్ణయం తర్వాత నవంబర్ 7వ తేదీన మరోసారి మంత్రివర్గం సమావేశంపై తుది నిర్ణయం తీసుకుంటామని గత కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రి పొంగులేటి వెల్లడించారు. అయితే హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహులంతా నిరాశ చెందారు. ఆయా పార్టీల శ్రేణులంతా డీలపడిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతున్నాయనేది రాష్ట్ర తా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Next Story