- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ ప్రజల స్టైలే వేరు.. గుంతల రోడ్లకు 'పుష్పాభిషేకం'!
నిరసన తెలపడంలో భాగ్యనగర వాసుల శైలే వేరు. తమ సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తడమే కాదు, అధికారుల కళ్లు తెరిపించేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నిరసన తెలపడంలో భాగ్యనగర వాసుల శైలే వేరు. తమ సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తడమే కాదు, అధికారుల కళ్లు తెరిపించేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా రామంతాపూర్ పరిధిలో స్థానికులు చేపట్టిన నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రామంతాపూర్ ప్రధాన రహదారులపై గత కొన్ని రోజులుగా పెద్ద పెద్ద గుంతలు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నా, ప్రభుత్వం గానీ, జీహెచ్‌ఎంసీ అధికారులు గానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో, స్థానికులు ఒక వినూత్న ఆలోచన చేశారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడానికి బదులు, వాటి చుట్టూ పూలు చల్లి, పూల మాలలు వేసి 'పుష్పాభిషేకం' చేశారు. "రోడ్ల పరిస్థితిని చూడలేకపోతున్న అధికారులకు మా నిరసన కనబడాలి" అంటూ స్థానికులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. "తెలంగాణ ప్రజలే కాదు.. వారి నిరసనలు కూడా చాలా మాస్ గా ఉంటాయి" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అధికారులను తిట్టడం కంటే ఇలాంటి వినూత్న నిరసనలే వారిలో చలనం కలిగిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.






