- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో విద్వంసాలకు గాదె ఇన్నయ్య కుట్ర పన్నాడు: NIA
మావోయిస్టు పార్టీ(Maoist Party) సిద్ధాంతాలను ప్రచారం చేశారన్న ఆరోపణలతో సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య(Gade Innaiah)ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party) సిద్ధాంతాలను ప్రచారం చేశారన్న ఆరోపణలతో సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య(Gade Innaiah)ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనగామా జిల్లాలోని జాఫర్ గడ్ లో ఉన్న ఆశ్రమంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నాంపల్లిలోని ఎన్‌ఐఏ(NIA) కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను నగరంలోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు గాదె ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో గాదె ఇన్నయ్యను ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. ఉపా (UAPA) చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే గాదె ఇన్నయ్య అరెస్ట్ పై కోర్టుకు సబ్ మీట్ చేసిన రిమాండ్ రిపోర్టు (Remand report)లో ఎన్ఐఏ పోలీసులు కీలక అంశాలను చేర్చారు. అందులో అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా గాదె ఇన్నయ్య వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. దేశంలో విధ్యంసాలకు ఇన్నయ్య కుట్ర పన్నారని ఎన్ఐఏ తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇన్నయ్య అరెస్ట్ పై ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.






