అమానవీయ ఘటన.. చెంచులు ఆస్పత్రికి వెళితే దుర్వాసన వస్తుందని వైద్యం చేయని సిబ్బంది

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-17 05:59:33  IST  )

న‌ల్గొండ జిల్లాలో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మాడుగుల‌ప‌ల్లి చ‌ర్ల‌గూడ‌కు చెందిన ఓ కుంటుంబం ఓటు హ‌క్కు వినియోగించుకుని తిరిగి

అమానవీయ ఘటన.. చెంచులు ఆస్పత్రికి వెళితే దుర్వాసన వస్తుందని వైద్యం చేయని సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్: న‌ల్గొండ జిల్లాలో అమాన‌వీయ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మాడుగుల‌ప‌ల్లి చ‌ర్ల‌గూడ‌కు చెందిన ఓ కుంటుంబం ఓటు హ‌క్కు వినియోగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా దుప్ప‌ల‌ప‌ల్లి వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో గాయాలు అవ్వ‌డంతో స్థానిక ఆస్ప‌త్రికి వెళ్లారు. అయితే ఆస్ప‌త్రి సిబ్బంది త‌మకు వైద్యం చేయ‌కుండా బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌న్నార‌ని బాధితులు బ‌ట‌యే కూర్చుకున్నారు.

చెంచు జాతికి చెందిన‌వాళ్లు కావ‌డంతో వాస‌న వ‌స్తుంద‌ని వైద్యం చేయ‌కుండా బ‌య‌ట‌నే ఉంచార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిన్న చిన్న గాయాలే అయ్యాయ‌ని అవే త‌గ్గిపోతాయ‌ని వెళ్లిపోమంటున్నార‌ని చెప్పారు. గాయాల‌పాలైన వారిలో ఓ మ‌హిళ లేవ‌లేని ప‌రిస్థితిలో ఉంద‌ని చెప్పారు. అడ్మిట్ చేసుకోవాల‌ని వేడుకున్నా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని బాధితులు ఆరోపించారు. ఆస్ప‌త్రి బ‌య‌ట ఉన్న‌వారిలో మ‌హిళ‌లు చిన్నారులు కూడా ఉన్నారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని బాధితులు కోరుతున్నారు. వీడియో

Read More... అరకొరగా వెంటిలేటర్ బెడ్స్

Next Story