- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు: వెంకయ్య నాయుడు
వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు: వెంకయ్య నాయుడు

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కవి, సాహితీ వేత్త, పరిశోధకుడు, ఆరుద్రగా సాహితీ లోకానికి సుపరిచితులైన భాగవతుల సదాశివ శంకరశాస్త్రి శత జయంతి ఏడాది సందర్భంగా, హైదరాబాదులోని హోటల్ దస్ పల్లాలో మంగళవారం వారి స్మారక తపాల బిళ్ళను ఆవిష్కరించడం ఆనందదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) అన్నారు. ఆరుద్ర, వారి రామలక్ష్మి "కవి జంట"గా తెలుగు సాహితీ ప్రపంచంలో చిరస్మరణీయులు అని పేర్కొన్నారు.
ఆరుద్ర "సమగ్రాంధ్ర సాహిత్యం" వంటి పరిశోధన గ్రంథాలు, "త్వమేవాహం" వంటి లోతైన సాహితీ దర్శనం, సరళమైన కూనలమ్మ పదాలు, "మానవుడే మహనీయుడు" వంటి స్ఫూర్తిదాయక సినిమా పాటలతో తెలుగు సాహితీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. వారి సాహితీ, పరిశోధనా తృష్ణ అందరికీ ఆదర్శం. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు, పెద్దల ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించడమని చెప్పారు. ఈ చారిత్రక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆరుద్ర మనుమడు చింతామణి గౌతమ్, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు. వారికి సముచిత గౌరవం కల్పించిన పోస్టల్ విభాగాన్ని వెంకయ్య నాయుడు అభినందించారు.






