- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళను విచక్షణా రహితంగా కొట్టి చైన్ స్నాచింగ్ కు యత్నం.. కలవరపరిచేలా దాడి దృశ్యాలు
కొంపల్లిలో కస్టమర్ రూపంలో వచ్చి ఆయిల్ షాప్ యజమానురాలిపై పిడిగుద్దులు కురిపించి, చైన్ స్నాచింగ్‌కు యత్నించిన దుండగుడిని స్థానికులు పట్టుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని కొంపల్లి పరిధిలో ఒక మహిళపై దుండగుడు దారుణంగా దాడి చేసి, బంగారం గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జయభేరి కాలనీలో ఆయిల్ షాప్ నిర్వహిస్తున్న యజమానురాలు తన షాప్ లో ఉండగా ఓ యువకుడు కస్టమర్ రూపంలో అక్కడికి వచ్చాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని గ్రహించి అకస్మాతుగా ఆమెపై దాడికి తెగబడ్డారు. ఆమెను కింద పడేసి ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ విచక్షణారహితంగా దాడి చేసి మెడలో ఉన్న చైన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ దాడితో హడలిపోయిన సదరు మహిళ కేకలు వేసింది. అరుపులు విన్న స్థానికులు దుండగుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తీవ్ర కలవరపాటుకు గురి చేసేలా ఉన్న ఈ దాడి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






