ఇందిరమ్మ ఇండ్లు.. రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

by Yella Dhawani Reddy |

రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గత ఎన్నికల ప్రచా రంలో ప్రకటించిన కాంగ్రెస్..

ఇందిరమ్మ ఇండ్లు.. రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కాంగ్రెస్.. అమలు దిశగా చర్యలు చేపట్టినప్పటికీ లబ్ధిదారులకు సరైన న్యాయం జరగడం లేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఐదు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనుంది. పునాది పూర్తయిన తర్వాత లబ్ధిదారుల ఖాతాలో రూ.లక్ష జమ చేస్తారు. గోడలు నిర్మించిన తర్వాత రూ.1.25 లక్షలు, స్లాబ్ దశలో రూ.1.75 లక్షలు, పూర్తి నిర్మాణం తర్వాత రూ.లక్ష జమ చేస్తారు.

ఇసుక దొరకడం సమస్య

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఇసుక అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో ఇక్కడ అమలు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ నాలుగు మండల కేంద్రాల్లో ఎక్కడ కూడా ఇసుక కేంద్రాలు లేవు. ఇసుక అందుబాటులో లేని జిల్లాలకు పక్క జిల్లాల నుంచి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ అమలవకపోవడం గమనార్హం.

ట్రాక్టర్ ఇసుక 6 వేలు

ప్రతి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఊపు అందుకోవడంతో ఇసుక కొరత అధికంగా ఏర్పడింది. దీంతో ఇసుక మాఫియా దారులు ఇదే అదనుగా భావించి లబ్ధిదారులతో రూ. 6వేలు ఆపైన మాట్లాడుకొని రాత్రి వేళల్లో విచ్చలవిడిగా ఇసుకను సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు చూసీ చూడనట్లు వ్యవరించడం ద్వారానే ఇసుక మాఫియా దారులు రెచ్చిపోతున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల స్పందించి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story