- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Ponguleti Srinivas Reddy : అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు : మంత్రి పొంగులేటి
రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్. రాష్ట్రంలోని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు(Indiramma Houses) అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్. రాష్ట్రంలోని అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు(Indiramma Houses) అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. కొత్తగూడెంలో నేడు జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికే 2.50 లక్షల ఇళ్ళ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
అర్హులైనప్పటికీ ఇళ్ళు మంజూరు కాని వాళ్ళు బాధ పడవద్దని సూచించారు. రోబోయే రోజుల్లో మిగతా లబ్ధిదారులకు కూడా విడతల వారిగా ఇళ్ళు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కట్టు కథలు నమ్మి మోసపోవద్దని, 10 ఏళ్ల కాలం వారి మాటలు నమ్మి దగా పడింది చాలన్నారు. తెలంగాణలో రైతుల, నిరుపేదల సంక్షేమం కోరేది కేవలం ఇందిరమ్మ రాజ్యమేనని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.






