- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG బడ్జెట్.. 1.15 కోట్ల కుటుంబాలకు "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా" పథకం
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.3,24,234 కోట్లుగా ప్రకటించారు. కాగా బడ్జెట్ లో పేద, ధనిక, మధ్యతరగతి అని తేడా లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు "ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా" పథకం అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఈ బీమా పొందనుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2026 జూన్ 2 నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. కాగా దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేసారు.
TG Budget: విద్యార్థులకు తీపికబురు.. ఇక అకౌంట్లలోకి నెలకు రూ.2 వేలు
Next Story






