- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుపేద కుటుంబాలకు భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా
“ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా” పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.

నిరుపేద కుటుంబాలకు భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా
జీవన బీమా పథకాన్ని పక్కాగా అమలు చేయాలి- డిప్యూటీ సీఎం భట్టి
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి భరోసా కల్పించేలా “ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా” పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంగళవారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణతో పాటు “ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా” పథకం అమలుపై చర్చించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమాల రూపకల్పన, అమలు విధానం, ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు. సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ సి.వి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.






