‘చీరి చింతకు కడతాం’.. బీఆర్ఎస్‌కు ఇందిరాశోభన్ హెచ్చరిక

by Gantepaka Srikanth |

నిరాధారమైన ఆరోపణలు చేస్తే.. చీరి చింతకు కడతాం అని కాంగ్రెస్ నేత ఇందిరాశోభన్ అన్నారు.

‘చీరి చింతకు కడతాం’.. బీఆర్ఎస్‌కు ఇందిరాశోభన్ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘అసత్యాల పునాదులపై అబద్ధాల మేడలు కట్టడం గులాబీ బాస్, ఆయన కోటరీకి వెన్నతో పెట్టిన విద్య. దోపిడీకి కేరాఫ్ అడ్రస్ ఎవరో యావత్ తెలంగాణకు తెలుసు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో సబ్బండ వర్గాలకు తెలుసు. సీతక్కను అసెంబ్లీలో ఎదుర్కోలేకనే అసత్యారోపణలు నిరాధారమైన ఆరోపణలు చేస్తే.. చీరి చింతకు కడతాం’ అని కాంగ్రెస్ నేత ఇందిరాశోభన్ అన్నారు. బీఆర్ఎస్ నేత ఆరోపణలకు ఇందిరా శోభన్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.

‘బీఆర్ఎస్ హయాంలో మహిళల పట్ల చూపిన వివక్షత, అభయహస్తం పెన్షన్ డబ్బులు కాజేసిన తీరును మంత్రి సీతక్క అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టడం నేరమా.?. మీ బాస్ లెక్కనే అందరూ దోచుకుంటారని భ్రమలో ఉన్నావు. దోపిడీ సంఘంలో చేరిన నీకు అంత దోపిడీ లాగానే కనబడుతుందా.? నిత్యం.. అసత్య ఆరోపణలు, అబద్ధాలతో బతుకుతున్న బీఆర్ఎస్ నాయకుల్లారా ఖబర్దార్. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ఈ సభ్య సమాజానికి తెలుసు. నోటికొచ్చినట్టు నిరాధారమైన ఆరోపణలు చేస్తే.. ప్రజాక్షేత్రంలోనే మీకు తగిన గుణపాఠం చెబుతాం. ఖబడ్దార్’ అని ఆమె హెచ్చరించారు.

Next Story