- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో విమానాల రద్దు.. రంగంలోకి దిగిన తెలంగాణ ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానాల రద్దు నాలుగో రోజుకూ కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానాల రద్దు నాలుగో రోజుకూ కొనసాగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమాన రద్దుల కారణంగా ఎయిర్‌పోర్టులో ఏర్పడ్డ గందరగోళాన్ని తగ్గించేందుకు తెలంగాణ RTC రంగంలోకి దిగింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు స్లీపర్ కోచ్‌లను సిద్ధం చేసింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి చెన్నై, బెంగళూరు రూట్లకు ప్రత్యేక బస్సులు బయల్దేరనున్నాయి.
ఏపీకి అదనపు సర్వీసులు..
చెన్నై, బెంగళూరుతో పాటు రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికుల కోసం కూడా అదనపు బస్సులను RTC అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. ఎయిర్‌పోర్టులో బస్సుల సమాచారం కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, టికెట్ల లభ్యతపై స్పష్టమైన వివరాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిగో విమానాల రద్దు కొనసాగుతున్న సందర్భంలో టీజీఎస్ఆర్టీసీ చేపట్టిన ఈ చర్య ప్రయాణికులకు భారీ ఊరట కలిగిస్తోంది.






