దూసుకెళ్తా.. గచ్చిబౌలిలో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ పోటీలు

by Ramesh Naini |

గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియంలో శనివారం ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభం అయింది.

దూసుకెళ్తా.. గచ్చిబౌలిలో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ పోటీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియంలో శనివారం ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్‌తో కలిసి రేసింగ్ వీక్షించారు. సూపర్‌ క్రాస్‌ రేసింగ్‌ తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రెండు రోజుల పాటు ఈ రేసింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఐఎస్‌ఆర్‌ఎల్‌ సహ వ్యవస్థాపకుడు ఇషాన్‌ లోఖండే రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో మొత్తం ఆరు జట్లకు సంబంధించిన 48 మంది రైడర్లు పాల్గొంటారని ఆయన తెలిపారు.

Next Story