Indian Racing League: సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

by Disha Web Desk 4 |
Indian Racing League: సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ రేసింగ్ లీగ్ శని, ఆదివారాల్లో నగరంలో సందడి చేయనుంది. హుస్సేన్ సాగర్ తీరం లోని నెక్లెస్ రోడ్డులోని 2.7 కిలో మీటర్ల ట్రాక్‌పై రేసింగ్ కార్లు దూసుకెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వరకు వెళ్లే ట్రాఫిక్‌ను షాదాన్ కాలేజ్, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు. బుద్ధభవన్ నల్లగుంట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించనున్నారు.

రసూల్ పుర మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి వైపు వచ్చే వాహనాలను కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతిస్తారు. ట్యాంక్ బండ్ తెలుగుతల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి వైపు మళ్లించనున్నారు. బీఆర్ కే భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ వెళ్లే వాహనాలను రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు.

ఖైరతాబాద్ బడా గణేష్ వీధి నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను రాజ్ దూత్ వైపు అనుమతిస్తారు. రేసింగ్ లీగ్ నేపథ్యంలో ఈనెల 9 నుంచి 11 వరకు ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ లు మూసి ఉంటాయని అధికారులు తెలిపారు. ఖైరతాబాద్ ఫై ఓవర్, నెక్లెస్ రోడ్ మూసివేయనున్నారు. బుద్ధ భవన్, నల్లగుంట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్, ఐమాక్స్ వైపు వాహనాలకు నో ఎంట్రీ అమలు కానుంది.

Read More....

FIFA World Cup 2022: వెలుగులోకి సంచలన విషయాలు



Next Story

Most Viewed