భారత జట్లకు ఐదు బంగారు పతకాలు

by Gantepaka Srikanth |

కొలంబోలో జరిగిన సౌత్ ఏషియా సెపక్ టక్రా చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు చరిత్ర సృష్టించాయి.

భారత జట్లకు ఐదు బంగారు పతకాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొలంబోలో జరిగిన సౌత్ ఏషియా సెపక్ టక్రా చాంపియన్‌షిప్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు చరిత్ర సృష్టించాయి. ఐదు బంగారు పతకాలు సాధించి అద్భుత విజయాలను నమోదు చేసినట్లు సెపక్ టక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ పెరిక సురేష్ తెలిపారు. సెపక్ టక్రా మేనేజ్‌మెంట్ కమిటీ నాయకత్వంలో ఈ లీగ్‌లో వాలీబాల్ వేగంగా ప్రాచూర్యం పొందుతోందని అన్నారు. ప్రధాని మోడీ 'ఖేలో ఇండియా ఖేలో' ఉద్యమ స్ఫూర్తిని సాకారం చేస్తూ భారత ఆటగాళ్లు చారిత్రక విజయం సాధించారని పేర్కొన్నారు. ఈ స్పోర్ట్​ఇండియాలో మరింత జనాదరణ పొంది, రికార్డుల సృష్టిస్తుందని, యువతలో క్రీడాభిమానం, స్పోర్ట్స్‌మాన్‌షిప్ భావనను వ్యాప్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవల టోక్యోలో జరిగిన 2026 ఏషియన్ గేమ్స్ టెస్ట్ ఈవెంట్‌లోనూ భారత పురుషుల సెపక్ టక్రా జట్టు గోల్డ్​ మెడల్​ సాధించి దేశానికి గౌరవం తెచ్చింది. ఈ అనూహ్య విజయంపై సౌత్ ఏషియా సెపక్ టక్రా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఎస్.ఆర్. ప్రేమ్ రాజ్, సెపక్ టక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు శ్రీనివాసులు, ఉమ్మడి కార్యదర్శి పెరిక సురేష్, జనరల్ సెక్రటరీ నరేష్ కుమార్ లు ఆటగాళ్లు, కోచ్‌లు, మేనేజ్‌మెంట్, ఫెడరేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు.ఈ చారిత్రక విజయం సెపక్ టక్రా క్రీడకు బలమైన గుర్తింపు తెచ్చిపెడుతుందని, యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

Next Story