- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy: జపాన్‌ను అధిగమించిన భారత్.. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో మనం ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నామని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (India has a $4 trillion economy) 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో మనం ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నామని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా వివరాలు తెలిపారు. 4 ట్రిలియన్ డాలర్లతో జపాన్ ను అధిగమించి భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, త్వరలో జర్మనీని కూడా అధిగమించనుందని తెలిపారు. మనకంటే ముందు స్థానంలో అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.
రాబోయే రెండు సంవత్సరాలలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ కూడా అంచనా వేస్తోందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ 2025 లో 6.2 శాతం, 2026 లో 6.3 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయడం జరిగిందని వెల్లడించారు. ఇది ప్రపంచంలో, ప్రాంతీయంగా మనతో పోటీ పడే దేశాల కంటే ఎక్కువ అని తెలిపారు. ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక వృద్ధిని 2025 లో 2.8 శాతంగా, 2026 లో 3.0 శాతంగా అంచనా వేసిందని వెల్లడించారు.






