- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bharat Summit: రెండో రోజు భారత్ సమ్మిట్.. చర్చించే కీలక అంశాలివే!
పెట్టుబడులు, ట్రేడ్ వార్స్, క్రోనీ క్యాపిటలిజం, ప్రపంచ శాంతే లక్ష్యంగా బుధవారం భారత్ సమ్మిట్-2025 (Bharat Summit) ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: పెట్టుబడులు, ట్రేడ్ వార్స్, క్రోనీ క్యాపిటలిజం, ప్రపంచ శాంతే లక్ష్యంగా బుధవారం భారత్ సమ్మిట్-2025 (Bharat Summit) ప్రారంభమైంది. హైదరాబాద్ (Hyderbad) హెచ్ఐసీసీ (HICC)లో జరుగుతోన్న సమ్మిట్‌కు సుమారు 100కు పైగా దేశాల నుంచి 450కి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులకు ఘన స్వాగతం కూడా లభించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సమ్మిట్‌ను రెండు రోజుల పాటు నిర్వహించాలని అనుకుంది. కానీ, పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) శుక్రవారం సంతాప దినంగా ప్రకటించింది.
ఈ మేరకు భారత్ సమ్మిట్ రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం HICCలో మొత్తం నాలుగు వేదికను ఏర్పాటు చేసింది. వాటికి ఈక్వాలిటీ హాల్ (Equality Hall), లిబర్టీ హాల్ (Liberty Hall), జస్టిస్ హాల్ (Justice Hall), ఫ్రెటర్నిటీ హాల్ (Fraternity Hall)గా నామకరణం చేసింది. సమ్మిట్‌లో డైవర్సిటీ (Diversity), రెస్పెక్ట్ (Respect), యాక్సలరేటింగ్ క్లైమెట్ (Accelerating Climate) లాంటి జస్టిస్ అంశాలపై చర్చించి సాయంత్రం ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన హైదరాబాద్ డిక్లరేషన్ (Hyderabad Declaration) చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ (AICC) అగ్ర నేతలు, పలువురు మంత్రులు పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, వనరులను వివిధ దేశాల ప్రతినిధులకు వివరించి రైజింగ్ తెలంగాణను ప్రమోట్ చేయనున్నారు.






