భారత్, పాక్ వార్ టెన్షన్.. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో భద్రతపై సమీక్ష

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-09 08:57:53  IST  )

భారత్, పాకిస్థాన్ మధ్య వార్ టెన్షన్ నెలకొన్న వేళ రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

భారత్, పాక్ వార్ టెన్షన్.. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో భద్రతపై సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య వార్ టెన్షన్ నెలకొన్న వేళ రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణా రావు, డీజీపీ జితేందర్, అదేవిధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు హాజరు కానున్నారు.

ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ప్రధాన ఆలయాలు, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్ల, బస్టాండ్ల భద్రతపై సమీక్షించనున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చేపట్టబోయే యాక్షన్ ప్లాన్‌పై చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి మొత్తం 109 దేశాల నుంచి అందాల భామలు నగరానికి చేరుకోగా.. వారి భద్రత పట్ల తీసుకుంటున్న చర్యలపై డీజీపీ జితేందర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రలకు వివరించనున్నారు. కాగా, ఈ అందాల పోటీలకు మరికొందరు నగరానికి రావాల్సి ఉండగా.. విమాన సర్వీసుల్లో అంతరాయం కారణంగా వారు ఇంకా నగరానికి చేరుకోలేకపోయినట్లుగా తెలుస్తోంది.

Next Story