- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్- పాక్ ఉద్రిక్తత.. ఢిల్లీలో 86 మంది తెలంగాణ వాసులు.. స్వస్థలాలకు పయనం!
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు బిక్కుబిక్కుమంటూ స్వస్థలాలకు చేరుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (India-Pakistan tension) భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు బిక్కుబిక్కుమంటూ స్వస్థలాలకు చేరుతున్నారు. శనివారం ఐఐటీ జమ్ములోని 8 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీలోని (Delhi Telangana Bhavan) తెలంగాణ భవన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దాదాపు 86 మంది తెలంగాణ వాసులు తాజాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఇప్పటివరకు 26 మందిని వారి స్వస్థలాలకు పంపించినట్లు భవన్ అధికారులు తెలిపారు. భవన్‌లో ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయం, ఆహారం, రవాణా సదుపాయం కల్పిస్తోంది.
ఉద్రిక్తతలు పెరిగితే మరో 100 మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన (Delhi Telangana Bhavan Control Room) కంట్రోల్ రూమ్ పనిచేస్తోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కాగా, ఢిల్లీలోని కంట్రోల్ రూమ్ నంబర్లు ల్యాండ్‌లైన్: 011-23380556, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్ - మొబైల్: 9871999044 , రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు - మొబైల్: 9971387500, లైజన్ ఆఫీసర్ - మొబైల్: 9643723157, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మొబైల్: 9949351270 నెంబర్లలో సంప్రదించవచ్చని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ తెలిపారు.






