- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump : ఆ నిధులతో భారత్ ప్రయోజనం పొందే ప్రయత్నం : ట్రంప్
యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) నిధులు అవకాశంగా తీసుకొని భారత్(India) ప్రయోజనం పొందుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్ : యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) నిధులు అవకాశంగా తీసుకొని భారత్(India) ప్రయోజనం పొందుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఆరోపించారు. భారత్ లో 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎవరినో గెలిపించడానికి గత అధ్యక్షుడు జో బ్రెడెన్ యూఎస్ఏఐడీ నిధులు రూ.182 కోట్లు కేటాయించారని సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రపంచంలో అధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్ వద్ద చాలా డబ్బు ఉందని, ఆ దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించారు.
భారత ఎన్నికల్లో ఓటు వేసేవారి సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇస్తున్న 21 మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తూ ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలోని డోజ్ (DOGE) తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్ధించారు. అయితే తమ దేశంలో ఓటర్ల శాతాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ నిధులను ఆపివేసినట్లు వివరించారు. అమెరికా చేస్తున్న ఆరోపణలపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యూఎస్ఏఐడీ ప్రయత్నించిందనే వార్తలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయని పేర్కొంది.
భారత ఎన్నికల్లో విదేశీ జోక్యానికి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రకటనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే ప్రకటించారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాతే దీనిపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని.. అసలు వాస్తవాలు తప్పకుండా వెలుగులోకి వస్తాయని తెలిపారు. యుఎస్ఎయిడ్ అనేది ఓ మంచి ఉద్దేశంతో ప్రపంచ దేశాలకు సాయం చేయడానికి రూపొందించిన విభాగమని పేర్కొన్నారు. అయినప్పటికీ దాని ద్వారా నిధులు దుర్వినియోగం అయ్యాయని ట్రంప్ వెల్లడించడాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు.
మరోవైపు యూఎస్ఏఐడీ నిధులను ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా వినియోగించారని బీజేపీ ఆరోపిస్తుండగా...కాంగ్రెస్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఇదే సమయంలో ఆ నిధులు భారత్ లో కాకుండా బంగ్లాదేశ్ లో వినియోగించారన్న కథనాలు యూఎస్ఏఐడీ నిధుల వినియోగంపై ఆసక్తికర చర్చకు తెరలేపినట్లయ్యింది.






