ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలోకి భారత్

by Malleboina Mahesh |

భారతదేశం 2026–28 కాలానికి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి (UN Human Rights Council) ఏడవసారి ఎన్నికైంది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలోకి భారత్
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశం 2026–28 కాలానికి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి (UN Human Rights Council) ఏడవసారి ఎన్నికైంది. ఈ ఎన్నికను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ న్యూయార్క్‌లో నిర్వహించగా, భారత్ ఏకగ్రీవంగా (unopposed) సభ్యత్వాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పి. సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “భారతదేశం మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల చూపుతున్న అచంచలమైన నిబద్ధతకు ఇది ప్రతీక” అని పేర్కొన్నారు.

రాయబారి హరీష్ పి. అన్ని సభ్య దేశాల మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, “మా పదవీకాలంలో మానవ హక్కుల పరిరక్షణ లక్ష్యాన్ని సమర్థంగా నెరవేర్చడానికి భారత్ కట్టుబడి ఉంది” అని తెలిపారు. మానవ హక్కుల మండలి ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ప్రోత్సాహం, రక్షణ, ఉల్లంఘనలపై సమీక్షలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విజయంతో భారత్ అంతర్జాతీయ వేదికపై తన నాయకత్వాన్ని మరోసారి నిరూపించుకుంది.

Next Story