- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Golconda Fort : ‘గోల్కొండ కోట’ పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం.. ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే గోల్కొండ కోట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ముస్తాబవుతోంది. మొదటి సారి ముఖ్యమంత్రి హోదాలో గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకం రేవంత్ రెడ్డి ఎగరవేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిపై వివరిస్తూనే.. గత బీఆర్ఎస్ పాలన వైఫల్యాలపై ఎత్తిచూపుతూ ప్రసంగం సాగనున్నట్లు సమాచారం.
కాగా, అమెరికా పర్యటన ముగించుకుని నేరుగా హైదరాబాద్ వచ్చిన సీఎస్ శాంతి కుమారి.. గోల్కొండ కోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. వర్షం పడే ఛాన్స్ ఉండటంతో వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ పై దృష్టి సారించాలని పోలీసులను ఆమె ఆదేశించారు. విదేశీ పర్యటన ముగించుకోని ఆగస్టు 14న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు రానున్నారు. అయితే, గోల్కొండ కోటలో కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.