- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: నగరంలో పెరుగుతున్న వేడి తీవ్రత
నగరంలో పెరుగుతున్న వేడి సమస్యలపై పరిష్కారాలను అన్వేషించేందుకు ఊర్వాణి ఫౌండేషన్‌కు చెందిన ఓపెన్ సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘అర్బన్ హీట్ డేటా జామ్’ నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో పెరుగుతున్న వేడి సమస్యలపై పరిష్కారాలను అన్వేషించేందుకు ఊర్వాణి ఫౌండేషన్‌కు చెందిన ఓపెన్ సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘అర్బన్ హీట్ డేటా జామ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అన్‌చార్టెడ్ సైన్స్, ఐఐఐటీ-హైదరాబాద్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ తదితర సంస్థల సహకారంతో నిర్వహించారు. ఈ డేటా జామ్‌లోజీఐఎస్ నిపుణులు, విద్యార్థులు, ఇంజినీర్లు, పౌరులు కలిసి నగరంలోని హీట్ ఐలాండ్ ప్రభావం, పచ్చదనం తగ్గుదల, పరిశ్రమలు, చెత్త డంపింగ్ యార్డ్ మరియు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేడి ప్రభావాన్ని డేటా ఆధారంగా విశ్లేషించారు.
హైటెక్ సిటీ, ఉప్పల్, బోరబండ, గచ్చిబౌలి, జవహర్ నగర్ వంటి ప్రాంతాల్లో వేడి తీవ్రత సామాజిక-ఆర్థిక అసమానతలతో ఎలా ముడిపడి ఉందో చర్చించారు. పచ్చదనం, నీటి వనరులు ఉన్న ప్రాంతాలు చల్లగా ఉండగా, అధిక నిర్మాణాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన వేడికి గురవుతున్నారని నిపుణులు గుర్తించారు. ఈ కార్యక్రమం నగర పాలక సంస్థలు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఖలీక్, వైద్యనాథ్, శ్రీనివాస్, డీబీఎఫ్ శంకర్, జాన్ మైఖేల్, పరిశోధకులు ప్రవీణ్, ఇంజనీరింగ్ విద్యార్థులు, ఆర్కిటెక్ట్ లు, డేటా పరిశోధన తదితర రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.






