రాష్ట్రంలో ఆర్టీసీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు పెరిగిన డిమాండ్

by Yella Dhawani Reddy |

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో ఆర్టీసీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు పెరిగిన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని (Free bus scheme) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ (TGRTC) బస్సుల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులకు భారీగా డిమాండ్ పెరిగింది. గతంలో ఈ బస్సుల్లో సగటున 67 శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండగా, ప్రస్తుతం అది 95 శాతాన్ని తాకుతోంది. అంతేకాక, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ నిష్పత్తి 110 శాతం దాటడం గమనార్హం. ఈ క్రమంలో గ్రామాలు, పట్టణాల ప్రజలు పెద్ద సంఖ్యలో మరిన్ని బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీని కోరుతున్నారు.

ప్రయాణికుల నుంచే కాకుండా ప్రజాప్రతినిధుల నుంచి.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి కూడా విజ్ఞాపనలు అందుతున్నాయి. ఇక గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సులు ప్రయాణం మొదలైన మొదటి రెండు మూడు గ్రామాల్లోనే పూర్తిగా నిండిపోతున్నాయి. దీంతో మధ్యలో ఉండే గ్రామాల ప్రజలు నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. దీని వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రయాణికుల భాద్యతను పరిగణనలోకి తీసుకుని ఆర్టీసీ రూ.193.44 కోట్ల వ్యయంతో కొత్తగా 503 బస్సులను కొనుగోలు చేయనుంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తిరిగే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సేవలకు ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో హైదరాబాద్‌, వరంగల్‌ వంటి పట్టణాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల సంఖ్యను కూడా పెంచాలని ఆర్టీసీ యోచిస్తోంది.

Next Story