తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. కంపార్ట్‌మెంట్లన్నీ హౌస్‌ఫుల్

by Malleboina Mahesh |

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు నిండిపోగా, టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. కంపార్ట్‌మెంట్లన్నీ హౌస్‌ఫుల్
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై భక్తుల రద్దీ (Crowd of devotees) విపరీతంగా పెరిగింది. వెసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో తిరుమల కొండపై భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు దాటి వెలుపల ఉన్న క్యూలైన్లలో కూడా భక్తులు భారీగా వేచివున్నారు. ఎలాంటి దర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) లభించడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్కరోజే స్వామివారిని మొత్తం 78,389 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో 45,283 మంది భక్తులు స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ.4.15 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

Next Story