ఖైరతాబాద్‌ మహాగణపతిని నిన్న ఒక్క రోజే ఎంతమంది దర్శించుకున్నారంటే

by Malleboina Mahesh |   (  Updated:2025-09-01 04:05:21  IST  )

ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో నగర రోడ్లాన్ని రద్దీగా మారిపోయాయి. పోలీసులు అధికారుల చర్యలతో నిన్న ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు మహాగణపతిని దర్శించుకున్నారు.

ఖైరతాబాద్‌ మహాగణపతిని నిన్న ఒక్క రోజే ఎంతమంది దర్శించుకున్నారంటే
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో వినాయకచవితి ఉత్సవాలు (Vinayaka Chavithi Festival) ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద వినాయకుడిగా పేరుగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Mahaganpati)ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా నిన్న ఆదివారం కావడంతో లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ కు పయనమయ్యారు. దీనికి తోడు పలు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్ బండ్‌కు చేరుకొని, నేరుగా ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్నారు. దీంతో నిన్న అర్ధరాత్రి వరకు 5 లక్షల మంది భక్తులు విశ్వశాంతి మహా గణపతిని దర్శించుకున్నారని ఉత్సవ సమితి అంచనా వేస్తుంది.

అయితే భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన అధికారులు, పోలీసులు ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా వేలాదిగా తరలివచ్చిన భక్తులు మహా గణపతిని దర్శించుకుంటున్నారు. వినాయక నవరాత్రుల్లో మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ రోజు 6వ రోజు సందర్భంగా ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతికి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఉత్సవ సమితి తెలిపింది.

Next Story