- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha : తాగునీరు ఇవ్వలేని అసమర్థతలో ప్రభుత్వం : కవిత
రాష్ట్రంలో ఓవైపు విద్యుత్ కోతల(Power Cuts)తో సాగు నీళ్లు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయని(Crop Fields are Drying), మరో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీరు(Drinking Water) కూడా ఇవ్వలేకపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఓవైపు విద్యుత్ కోతల(Power Cuts)తో సాగు నీళ్లు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయని(Crop Fields are Drying), మరో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీరు(Drinking Water) కూడా ఇవ్వలేకపోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha)విమర్శించారు. యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలలో సాగు..తాగునీటీ సమస్యల కథనాలను ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. ఆలేరు, భువనగిరి, జనగామ నియోజకవర్గాలలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించారని గుర్తుచేశారు.
విద్యుత్ సమస్య ఉండొద్దని కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాలో పవర్ ప్లాంటు ఏర్పాటు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాటి ద్వారా సక్రమంగా తాగునీటిని కూడా అందించలేని అసమర్థతలో పడిపోయిందని..కేవలం వారు కమీషన్లపై దృష్టి కేంద్రీకరించారని కవిత విమర్శించారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా కేసీఆర్ ఈ ప్రాంతాలకు సాగు, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారన్నారు. సమ్మక్క సారాలమ్మ 95శాతం పూర్తి చేయగా..అసంపూర్తి 5శాతం పనులను కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం ఏడాదిగా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.






