- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం.. అయినా తగ్గని భక్తుల రద్దీ
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో ఇవాళ ఎడతెరిపిలేకుండా వర్షం కురస్తూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో ఇవాళ ఎడతెరిపిలేకుండా వర్షం కురస్తూనే ఉంది. మరోవైపు కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. శుక్రవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 2 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 71,110 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 25,695 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి స్వామి వారి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.






