INC: కడుపు మంటతోనే ఇలాంటి మాటలు.. కేటీఆర్ పై ఎంపీ చామల హాట్ కామెంట్స్

by Ramesh Goud |

కేటీఆర్ కడుపు మంటతో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) విమర్శించారు.

INC: కడుపు మంటతోనే ఇలాంటి మాటలు.. కేటీఆర్ పై ఎంపీ చామల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ కడుపు మంటతో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. గాంధీభవన్(Gandhi Bhavan) లో మీడియా సమావేశంలో(Press Meet) మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ కు రాత్రి సమయంలో నిద్ర పట్టక రోజుకో ప్రెస్ మీట్ తో మీడియా ముందుకు వస్తున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం చేసేందుకే మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గతంలో సూట్ వేసుకున్న కేటీఆర్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) జాకెట్ వేసుకున్న చూడలేకపోతున్నారని, అంత దరిద్రంగా ఆలోచిస్తున్నారని అన్నారు. కడుపు మంటతో ఏం మాట్లాడుతున్నాడో కూడా కేటీఆర్ కు అర్థం కావడం లేదని, అందుకే కడుపు చల్లగా చేసుకొని పడుకోవాలని ఈనో ప్యాకెట్లు పంపినట్లు వెల్లడించారు. చెడు ప్రచారానికి కూడా ఒక అర్థం ఉంటుందని, కానీ నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story