- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
INC: ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు రాజ్యంగ విరుద్ధం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(RSS Chief Mihan Bhagavath ) వ్యాఖ్యలు రాజ్యంగ విరుద్ధమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC Leader Rahul Gandhi) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(RSS Chief Mihan Bhagavath ) వ్యాఖ్యలు రాజ్యంగ విరుద్ధమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC Leader Rahul Gandhi) అన్నారు. పాట్నా(Patna)లో జరిగిన 'సంవిధాన్ సురక్షా సమ్మేళనం(Samvidhan Suraksha Summit)'లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం(Independence Day) వచ్చిన రోజు గురించి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. గంగాజలం ప్రతిచోటా ప్రవహించినట్లే, రాజ్యాంగంలోని భావజాలం కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థకు చేరాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
అలాగే కొన్ని రోజుల క్రితం, RSS చీఫ్ మోహన్ భగవత్ భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం రాలేదని అన్నారు.. అలా అయితే ఆయన భారత రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నట్లేనని చెప్పారు. అంతేగాక మోహన్ భగవత్ భారతదేశంలోని ప్రతి సంస్థ నుండి డాక్టర్ BR అంబేద్కర్, లార్డ్ బుద్ధ, మహాత్మా గాంధీ యొక్క భావజాలాన్ని తుడిచివేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలోని సంపద అంతా ఇద్దరు, ముగ్గురు చేతుల్లోకి మాత్రమే వెళ్లాలని భారత రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందో చెప్పాలన్నారు. నేటి భారతదేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు అధికారం లేదని.. వెనుకబడిన వర్గాల, దళితులు, గిరిజనులకు చెందిన బీజేపీ ఎంపీలను కలిసినప్పుడు మమ్మల్ని బోనులో బంధించారని రాహుల్ గాంధీ అన్నారు.






