- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
INC: వంటా వార్పు నిరసన మరిచారా..? బీఆర్ఎస్ నేతకు మంత్రి సీతక్క కౌంటర్
ఉద్యోగుల వేతనాలపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నానని పంచాయితీ రాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఉద్యోగుల వేతనాలపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నానని పంచాయితీ రాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో పంచాయితీ కార్మికులు, ఉద్యోగులు వేతనాలు అందక రోడ్లు ఎక్కుతున్న దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) ట్వీట్ చేశారు. దీనిపై సీతక్క స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా కౌంటర్(Counter) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె.. పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని, ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారూ గుర్తుకులేదా? అని నిలదీశారు.
మీ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) పాలనలో కార్మికుల జీతభత్యాలు హస్తవ్యస్తం అయ్యాయని, 2023 మార్చి 13న పంచాయతీ కార్మికుల వంటా వార్పు నిరసన మరిచారా? అని ప్రశ్నించారు. అలాగే మీ హయాంలో వేల మంది చిరు ఉద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, మేము కాంగ్రెస్(Congress) ప్రజా ప్రభుత్వం మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుతున్నామని తెలిపారు. అంతేగాక 92 వేల పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించి, గ్రామీణ స్థాయిలో సిబ్బందికి గౌరవంతో జీవన మార్గం కల్పించామని చెప్పారు. ఇక అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోండి హరీష్ రావు అని సీతక్క హితవు పలికారు.






