Minister Ponnam: 14న దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ భవన ప్రారంభోత్సవం : మంత్రి పొన్నం

by Y. Venkata Narasimha Reddy |

Inauguration of Doddi Komurayya's memorial building on the 14th: Minister Ponnam

Minister Ponnam: 14న దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ భవన ప్రారంభోత్సవం : మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్ : నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్ వద్ద దొడ్డి కొమరయ్య(Doddi Komurayya's memorial Kuruma Sangham building) కురమ సంఘ ఆత్మ గౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14వ తేదీన ప్రారంభిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhaker) వెల్లడించారు. దొడ్డి కొమరయ్య కురమ సంఘ ఆత్మ గౌరవ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కురుమ భవన ప్రారంభోత్సవానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభృతులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పొన్నం సూచించారు. తక్షణమే కురుమ సంఘం భవనానికి విద్యుత్తు, వాటర్ కనెక్షన్ పూర్తి చేయాలని ఆదేశించారు. వాటర్ కనెక్షన్స్ కి సంబంధించిన పేమెంట్ ను జిల్లా కలెక్టర్ చెల్లించాలని సూచించారు.

సీఎం సభకు అవసరమైన జన సమీకరణ చేయాలని ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంకు, కురుమ సంఘం ప్రతినిధులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. దాదాపు 30 వేల మంది సభా నిర్వహణ ఉండాలన్నారు. జన సమీకరణకు కావాల్సిన వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు సభ స్థల పరిశీలన తదితర వాటిని జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అన్ని విభాగాలను బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ , హెచ్ఎండీఎ కమిషనర్ సర్పరాజ్ , బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి , జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ఐఅండ్ పీఆర్ కమిషనర్ హరీష్ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Next Story