రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు

by Kema Shiva Kumar |

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై వరంగల్‌లో కేసు నమోదైంది.

రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు
X

దిశ, వెబ్‌‌డెస్క్: బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) మరోసారి చిక్కుల్లో పడ్డారు. బుధవారం హన్మకొండలో నిర్వహించిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)లను ఉద్దేశించి కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నారంటూ చేశారంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, తదితరులు వరంగల్‌లోని సుబేదారి పోలీసులకు కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరక సీఐ మేకల రంజిత్‌ కుమార్ కేటీఆర్‌పై బీఎన్ఎస్ యాక్ట్‌లోని 504, సెక్షన్ 505 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. రైతు సదస్సు వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, తద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Next Story