- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక నెక్స్ట్ ఖైరతాబాద్ బై ఎలక్షన్!.. పీజేఆర్ కూతురు సంచలన వ్యాఖ్యలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు జూబ్లీహిల్స్ (Jubilee Hills bypoll) బై పోలు చుట్టూ తిరుకుతున్నాయి. ఈ సెగ్మెంట్ లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే జూబ్లీహిల్స్ తర్వాత రాష్ట్రంలో ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక రాబోతోందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ పీజేఆర్ కూతురు, కాంగ్రెస్ నేత విజయరెడ్డి (Vijaya Reddy) కీలక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్ తో విజయరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నెక్స్ట్ ఖైరతాబాద్ కు (Khairatabad by-election) ఉప ఎన్నిక రాబోతోందని అక్కడ మీరే బరిలోకి దిగి విజయం సాధించబోతున్నారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ గెలవబోతోందని అన్నారు. పీజేఆర్ మార్క్ ప్రతి చోట ఉందని తాము కూడా పీజేఆర్ వారసులమనే కాకుండా ప్రజలతో మమేకం అవుతూ వారితో ఉంటున్నామన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి తనకు అవకాశం ఇచ్చారని అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరని చెప్పారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు.
జూబ్లీహిల్స్ ఫలితంతో ఖైరతాబాద్ డిసిషన్?:
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో దానం కాంగ్రెస్ బీ ఫామ్ తో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో టెక్నికల్‍గా దానంపై శాసనసభా స్పీకర్ చర్యలు తీసుకోవడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. విషయం చర్యల వరకు వెళ్లేకంటే ముందే దానం తనంతట తానే రాజీనామా చేసే విషయంలో తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ బై పోల్ లో ఫలితం ఆధారంగా ఖైరతాబాద్ సెగ్మెంట్ లో పాలిటిక్స్ ఉండబోతున్నాయనే చర్చ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.






