- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం
by GSrikanth |
తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గురువారం అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు అయింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గురువారం అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు అయింది. ఇవాళ ఉదయం 11 :01 గంటలకు గరిష్టంగా 15,497 మెగావాట్ల విద్యుత్ అత్యధిక పీక్ డిమాండ్ గా నమోదైందని ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. మార్చి నెలారంభం నుంచే 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదు అవుతోందని అయితే ఉష్ణోగ్రతలు పెరగడం, పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి కరెంట్ వినియోగం పెరగడమే ఈ డిమాండ్ కు కారణం అని తెలిపారు. మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానిదే అన్నారు. విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత తెంలగాణ ఉందని తెలిపారు. అయితే ఈ వేసవిలో 16 మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు.
Next Story






