- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బయో ఏసియా చరిత్రలో.. ఈ ఏడాది మైలు రాయి : మంత్రి శ్రీధర్ బాబు
బయో ఏసియా చరిత్రలోనే ఈ ఏడాది ఓ మైలు రాయి అని, తాము ఊహించిన దాని కంటే కూడా ఈ సారి స్పందన ఫుల్‌గా ఉందని పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బయో ఏసియా చరిత్రలోనే ఈ ఏడాది ఓ మైలు రాయి అని, తాము ఊహించిన దాని కంటే కూడా ఈ సారి స్పందన ఫుల్‌గా ఉందని పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్హెచ్ఐసీసీలో జరిగిన "బయో ఏషియా 2025" ముగింపు, స్టార్టప్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ఈ మేరకు బుధవారం పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు జయేష్‌రంజన్, మల్లూర్లతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సదస్సులో 200 కు పైగా బీ టూ బీ(బిజినెస్ టూ బిజినెస్) మీటింగ్స్ జరిగాయని, దాంతో గతేడాది కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయన్నారు. అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ దిగ్గజ సంస్థ "ఆమ్జెన్" మన దగ్గర భారీగా పెట్టుబడి పెట్టిందని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు.
ఈ సంస్థ వల్ల సుమారు మూడు వేల మందికి ఉపాధి దక్కుతుందన్నారు. ఈ ఏడాది సదస్సుకు దేశ భవిష్యత్తును మార్చే సత్తా ఉన్న ప్రతిభ గల యువ ఆవిష్కర్తలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారన్నారు. వారి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన ఈ ఆవిష్కరణలు ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తాయన్నారు. మొత్తం 84 స్టార్టప్స్ ఈ ఏడాది సదస్సు లో పాల్గొన్నాయన్నారు. ఆవిష్కరణలకు అండగా ఉండేందుకు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు, పరిశ్రమలతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. తెలంగాణను నాణ్యమైన మానవ వనరులకు హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ పై దృష్టి సారించామని, సంబంధిత రంగంలో అనుభవమున్న 4 పరిశ్రమల సహకారం తో "సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ" పేరిట ప్రత్యేక కోర్సును ప్రారంభించామన్నారు. మొదటి బ్యాచ్ లో 140 మంది విద్యార్థులు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని, వీరిలో 82 మంది అమ్మాయిలే ఉండటం విశేషం అన్నారు. వీరిలో 60 శాతం మంది నిరుద్యోగ అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని, వీరిలో సగం మంది తల్లిదండ్రులకు పెద్దగా చదువుకోలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కు కొదువ లేదన్నారు. అలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి... వారికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి... వారిని ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ గా తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి శ్రీదర్‌బాబు పేర్కొన్నారు.
హార్ట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ గా మారిన జీనోమ్ వ్యాలీ లో "వ్యాక్సీన్ టెస్టింగ్ ఫెసిలిటీ" ని కేంద్రం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే ఇక్కడి కంపెనీలకు ఎంతో మేలు జరుగుతుందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, వారితో పాటు కలిసి నడుస్తామని, అంతే కాకుండా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టు కుంటామని తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలని బయో ఏషియా 2025 వేదిక గా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.






