- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కదంతొక్కిన పెద్ద ధన్వాడ.. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరు ఉధృతం
జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని రాజోలి మండల పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చు రాజేసింది.

దిశ, వెబ్‌డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని రాజోలి మండల పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చు రాజేసింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం మొత్తం 10 గ్రామాలకు చెందిన ప్రజలు ఊహించని రీతిలో పెద్ద ధన్వాడలో ఫ్యాక్టరీ నిర్మించ తలపెట్టిన ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులకు ఆందోళకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైైన గ్రామస్థులు పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తిరగబడ్డారు. వారి కార్లతో పాటు ఇతర సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేసి వాటికి నిప్పంటించారు. గతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ వ్యతిరేకంగా పోరాటలు చేయగా.. కొన్ని రోజుల పాటు వివాదం సద్దుమణిగింది. తాజాగా, మంగళవారం ఫ్యాక్టరీ నిర్మాణం కోసం యాజమాన్యం కంటైనర్లతో పాటు జేసీబీలు, కార్మికులను పెద్ద ఎత్తున పెద్ద ధన్వాడకు తీసుకెళ్లగా.. ఇవాళ మరోసారి 10 గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ మరోసారి పోరుబాట పట్టారు.






