పచ్చదనం పెంపునకు బడ్జెట్‌లో రూ. 326 కోట్లు

by Disha Web Desk 7 |
పచ్చదనం పెంపునకు బడ్జెట్‌లో రూ. 326 కోట్లు
X

దిశ, సిటీ బ్యూరో : జిహెచ్ఎంసి పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జిహెచ్ఎంసి బడ్జెట్ నుండి రూ. 326 కోట్లు కేటాయించినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా శనివారం బంజారాహిల్స్ గఫార్ ఖాన్ పార్క్‌లో మేయర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణకు హరిత కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలో 2014 నుండి 2022-23 వరకు 741 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం కాగా 698.78 లక్షల మొక్కలు నాటినట్లు మేయర్ వివరించారు.

అవెన్యూ ప్లాంటేషన్, కాలనీ ఇనిస్టిట్యూషన్, ఓపెన్ స్పేస్, స్మశాన వాటికల్లో, మొదలైన వినూత్న, పద్ధతిలో జిహెచ్ఎంసి పరిధిలో పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల మొక్కల పెంపకం లక్ష్యం కాగా లక్ష్యాన్ని మించి 77.29 లక్షల మొక్కలు పెంచడం జరిగిందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి కి 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు 42 లక్షల మొక్కలు నాటడం జరిగిందని, అందుకోసం నగరంలో 600 నర్సరీలను ఏర్పాటు చేసి అవసరమైన మొక్కలు సిద్ధం చేసుకుంటున్నట్లు మేయర్ వెల్లడించారు. ఒకే రోజు కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి పరిధిలో 1 లక్ష 50 వేల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed