- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News: ఆ పార్టీ అభ్యర్థికి త్రుటిలో తప్పిన ప్రమాదం
by Indraja |
హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్థసారధికి త్రుటిలో ప్రమాదం తప్పివది.

X
దిశ ప్రతినిధి, ధర్మవరం: హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్థసారధికి త్రుటిలో ప్రమాదం తప్పివది. ఆయన ప్రయానిస్తున్న ఫార్చునర్ వాహనం ప్రమాదానికి గురైంది. అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పార్థసారధి పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపానగల ఎన్ హెచ్ 44 వద్ద ఉన్న హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద ఐచర్ వాహనం బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం ఢీకొంది.
కాగా ఈ ఘటనలో పార్థసారధి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న పార్థసారధికి పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం అనంతరం ఎస్కార్ట్ వాహనం స్కార్పియో లో అక్కడి నుండి పార్థసారథి వెళ్లిపోయారు.
Next Story






