కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు కన్ఫామ్.. అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్

by Disha Web Desk 2 |
కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు కన్ఫామ్.. అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంపీ ఎన్నికల్లో భువనగిరి లోక్ సభతో పాటు ఇతర స్థానాల్లో మద్దతు ఇవ్వాలని సీపీఎంను కోరామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీపీఎం నేతలతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించామని ఈ సందర్భంగా సీపీఎం నేతలు తమ ఎదుట కొన్ని ప్రతిపాదనలు పెట్టారని వెల్లడించారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీకి సీపీఎం మద్దతు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.

దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పని చేయనున్నారని ఒకట్రెండు విషయాల్లో సీపీఎంతో సందిగ్ధత ఉన్నప్పటికీ అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామని చెప్పారు. సీపీఎం సహకారంతో భవిష్యత్ లో ముందుకెళ్తాన్న సీఎం.. ఈ కలయిక కాంగ్రెస్ గెలుపునకు పని చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తమ్మినేని వీరభద్రం ఎంపీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను విరమించుకోవాలని సీఎం కోరినట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీజేపీ శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.



Next Story

Most Viewed