ఇంటింటికీ కాంగ్రెస్‌ను చేర్చేలా మరో కొత్త ప్రొగ్రామ్.. పేరు ఇదే..!

by Disha Web Desk 4 |
ఇంటింటికీ కాంగ్రెస్‌ను చేర్చేలా మరో కొత్త ప్రొగ్రామ్.. పేరు ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : లాస్ట్ రౌండ్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేయాలని టీపీపీసీ అనుబంధ సంఘాలన్నింటికి సూచించింది. ఎన్ఎస్ యూఐ, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్నారై సెల్స్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల విభాగాలతో పాటు అన్ని కుల సంఘాలు, ఫెడరేషన్లు ఎన్నికల క్యాంపెయిన్ పాల్గొనాలని పేర్కొంది. చివరి మూడు రోజుల్లో అన్ని గ్రామాలను చూట్టేయాలని టీపీసీసీ ఆదేశాలిచ్చింది. ఇంటింటికి ‘హాయ్ కాంగ్రెస్’ పేరిట ఎన్నికల ప్రచారం జరగాలని నొక్కి చెప్పింది. జిల్లా కమిటీలతో సమన్వయమై, ఎక్కడికక్కడ గ్రామాలన్నీ కాంగ్రెస్ మయం చేయాలని అన్ని జిల్లాలకు సూచనలు ఇచ్చారు.

వార్ రూమ్ నుంచి యాక్షన్ ప్లాన్ జిల్లా నేతలకు చేరింది. ప్రచారంతో పాటు పోల్ మేనేజ్‌మెంట్, కో ఆర్డినేషన్, నేతల మధ్య విబేధాలు రాకుండా జగ్రత్త పడాలని టీపీసీసీ కోరింది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలన్నింటి నుంచి జిల్లాకు ఒకరు చొప్పున మానిటరింగ్ చేయాలని స్పష్టం చేసింది. ఇంత కాలం ప్రచారం చేసింది ఒక ఎత్తయితే.. చివరి మూడు రోజుల ప్రచారం సత్ఫలితాలను తీసుకురావడంలో మేలు చేస్తుందని టీపీసీసీ కీలక నేతలు అనుబంధ సంఘాలకు వివరించారు. దీంతో అనుబంధ సంఘాల ముఖ్య నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్ లలో ప్రచారానికి రెడీ అయ్యారు. కుల సంఘాలు, యూత్, రైతులతో మీటింగ్‌లు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరనున్నారు.

వార్ రూమ్ నుంచి ఆదేశాలు..

రాష్ట్రంలో 14 సీట్లు పక్కా అని సీఎం నుంచి మంత్రుల వరకు ప్రతి రోజు చెబుతున్నారు. ఇప్పుడు ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజుకో కొత్త స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. కొన్ని చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ గ్రౌండ్ లెవల్ లీడర్లతో ఇంటర్నల్ పాలిటిక్స్ కు చొరవ చూపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే సాధారణ పబ్లిక్‌ను కన్విన్స్ చేయగలిగితే పార్టీ పెట్టుకున్న టార్గెట్‌ను చేరుకోవచ్చని నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో చివరి మూడు రోజుల పాటు గాంధీభవన్‌లోని పార్టీ అనుబంధ విభాగాలు, నేతలు, జిల్లా కమిటీ, కో ఆర్డినేషన్ టీమ్‌లన్నీ ప్రచారంలో నిమగ్నం కానున్నాయి. అనుబంధ సంఘాల ప్రణాళికను సంపూర్ణంగా సక్సెస్ చేసేందుకు గాంధీభవన్‌లోని వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు అందనున్నాయి.

Next Story

Most Viewed