సోషల్ మీడియాలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అరగంటలోనే ఫాలోయింగ్ మామూలుగా లేదుగా!

by Disha Web Desk 14 |
సోషల్ మీడియాలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అరగంటలోనే ఫాలోయింగ్ మామూలుగా లేదుగా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఓపెన్ చేశారు. ‘kcrbrspresident’ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరుతో సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేశారు. ట్విట్టర్ వేదికగా ముందుగా ఖాతా ఓపెన్ చేయడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు, సన్నిహితులు తదితరులతో పాటు ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ లాంటి వారు ఆయనను ఫాలో అవుతున్నారు. కేసీఆర్ ఎక్స్ వేదికగా మొదటగా ముగ్గురిని ఫాలో అయ్యారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, సంతోష్ రావుతో పాటు మనువడు హిమాన్షును కేసీఆర్ మొదట ఫాలో అయ్యారు.

కేసీఆర్ క్రియేట్ చేసిన ట్విట్టర్ ఖాతా అరగంటలో దాదాపు నాలుగు వేలకు పైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు. ఇంకా ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు. దీంతో కేసీఆర్‌ను ఫాలో కావాలని ఆయన అభిమానులు కేసీఆర్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ ఖాతాలను ఓపెన్ చేయడం చర్చానీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉపయోగిస్తారని అభిమానులు చెబుతున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కేసీఆర్ కొత్త ప్లాన్ వేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Click Here For Twitter Post..



Next Story

Most Viewed