పోలింగ్ రోజున ఇంటికి బైక్ ట్యాక్సీ ఫ్రీ

by Dishanational4 |
పోలింగ్ రోజున ఇంటికి బైక్ ట్యాక్సీ ఫ్రీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ఓటర్లకు శుభవార్త. ఎందుకంటే మే 25న ఓటింగ్ వేళ పోలింగ్ బూత్‌ల నుంచి వారివారి ఇళ్లకు ఉచితంగా బైక్ ట్యాక్సీ సౌకర్యాన్ని పొందొచ్చు. ఈవిధంగా ఓటర్లకు సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించి ర్యాపిడో కంపెనీతో ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఢిల్లీలో ర్యాపిడోకు 80 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, దాదాపు ఎనిమిది లక్షల మంది బైక్ డ్రైవర్లు ఉన్నారు. ఢిల్లీ అంతటా తమకు బైక్ రైడర్లు ఉన్నారని ర్యాపిడో తెలిపింది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఓటర్లను ఇళ్లకు చేర్చే సామర్థ్యం తమ సొంతమని వెల్లడించింది. కాగా, పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాపిడో బైక్ ట్యాక్సీని ఎక్కేవారు తప్పకుండా తమ వేలిపై ఉన్న సిరాగుర్తును చూపించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏదైనా ఓ గుర్తింపు కార్డు జిరాక్స్ ప్రతిని అందించి, బైక్ ట్యాక్సీ ఉచిత రైడ్‌ను ప్రారంభించవచ్చు.

Next Story

Most Viewed