G pay వినియోగదారులకు బిగ్ షాక్.. వచ్చే నెల నుంచి గూగుల్ పే సేవలు బంద్!

by Jakkula Samataha |

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు విధానం అనేది విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. ఏ చిన్న అవసరానికైనా వీటినే ఉపయోగిస్తున్నారు. రోజు రోజుకు ఈ ఫోన్ పే, గూగుల్ పే వాడే వారి

G pay వినియోగదారులకు బిగ్ షాక్.. వచ్చే నెల నుంచి గూగుల్ పే సేవలు బంద్!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు విధానం అనేది విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. ఏ చిన్న అవసరానికైనా వీటినే ఉపయోగిస్తున్నారు. రోజు రోజుకు ఈ ఫోన్ పే, గూగుల్ పే వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా మొదట్లో గూగుల్ పే స్క్రాచ్ కార్డ్‌లో క్యాష్ బ్యాక్ ఆఫర్ పెట్టి అందరినీ ఆకర్షించింది. ఇక ప్రస్తుతం స్క్రాచ్ కార్డ్‌లో ఓచర్స్ , క్యాష్ బ్యాక్ లాంటివి వస్తుంటాయి. దీంతో దీనికి అట్రాక్ట్ అయిపోయి చాలా మంది గూగుల్ పేను వాడుతున్నారు. అయితే ఈ గూగుల్ పే వాడే వినియోగదారులకు బిగ్ షాక్ తగలనుంది. జూన్ 4 నుంచి గూగుల్‌పేను మూసి వేయబోతున్నట్లు ఆ సంస్థనే స్వయంగా తెలిపింది. కాగా, దీనిని ఏయే దేశాలు మూసి వేయబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జూన్ 4 తర్వాత గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్‌లో మాత్రమే పని చేయనుందంట. అమెరికాలో దీని సేవలు నిలిపివేయబోతున్నట్లు గూగుల్ తెలిపింది. కంపెనీ ప్రకారం వినియోగదారులందూ గూగుల్ వాలెట్‌కి బదిలీ చేయబడుతారు. అందువలన గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి. గూగుల్ వాలెట్‌ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు. దాదాపు 180 దేశాల్లో Gpayని Google Wallet భర్తీ చేసిందని కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది.

Next Story