FLASH..FLASH: భైంసా ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. కేటీఆర్‌పై టమాటాలు, ఉల్లిగడ్డలతో దుండగుల దాడి

by Disha Web Desk 1 |
FLASH..FLASH: భైంసా ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. కేటీఆర్‌పై టమాటాలు, ఉల్లిగడ్డలతో దుండగుల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా భైంసాలో బీఆర్ఎస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని పాత చెక్‌పోస్ట్‌ కార్యాలయం కూడలి వద్ద కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్‌ మాట్లాడుతుండగా. ఆ సమయంలో కొందరు కేటీఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా జనంలోంచి కొందరు ఆకతాయిలు కేటీఆర్‌పై ఉల్లిగడ్డలు, టమాటాలు వేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపుతప్పకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను, బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టి కేటీఆర్‌కు భద్రత కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసన కారుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed