- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు దశల్లోనూ బీజేపీ కనుమరుగైంది: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శలు
సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కనుమరుగైందని, తదుపరి విడతల్లో మరింత దిగజారుతుందని తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు జరిగిన రెండు దశల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కనుమరుగైందని, తదుపరి విడతల్లో మరింత దిగజారుతుందని తెలిపారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం బీజేపీ బలహీనంగా ఉందని ఆరోపించారు. మొదటి, రెండు దశల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అర్థమైందని పేర్కొన్నారు. బీజేపీ ఓటర్లను పొందడంలో విఫలమైందని స్పష్టం చేశారు. ఇండియా కూటమి బలంగా ఉందని తెలిపారు. బీజేపీని విడిపించుకునేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని వెల్లడించారు. ద్రవ్యోల్భనం, నిరుద్యోగం ఈ రెండు అంశాలే బీజేపీపై ప్రభావం చూపుతాయని తెలిపారు. బీజేపీకి పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని పేర్కొన్నారు. కాగా, ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండు విడతలు పూర్తైన విషయం తెలిసిందే.






