- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Alerts in Telangana : ఉగ్రదాడుల నేపథ్యం... తెలంగాణకు హై అలర్ట్ జారీ
పహల్గాం ఉగ్రదాడుల(Pahalagam Terror Attack) నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్స్(High Alerts in Telangana) జారీ అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడుల(Pahalagam Terror Attack) నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్స్(High Alerts in Telangana) జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర నిఘా వర్గాలు(Central Intelligence Agency) చేసిన హెచ్చరికలతో తెలంగాణ పోలీసు(Telangana Police) శాఖ అప్రమత్తం అయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad) లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ సహ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలన్నిటికీ గురువారం కేంద్ర నిఘా వర్గాలు ఈ హెచ్చరికలు జారీ చేశాయి.
అన్ని రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో, దేశ సరిహద్దుల్లో అదనపు భద్రతా బలగాలు మోహరించాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా యుద్ధం ముంచుకు రావొచ్చునేమో అనే అనుమానాలు ఇరు దేశాల్లోనూ వ్యాపించాయి.






